కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు బాంబులు తయారు చేస్తున్నారన్న సమాచారం నిఘా సంస్థలతో గుర్తించబడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ మరియు డీజీపీ హరీష్ గుప్తాలకు వేరువేరుగా లేఖలు రాశారు.
ఇది కూడా చదవండి: విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!
ఈ లేఖల్లో పవన్ కల్యాణ్, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు, స్లీపర్ సెల్స్, రోహింగ్యాల వంటి అక్రమ వలసదారుల కదలికలపై అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా అవసరమని వివరించారు. గతంలో గుంటూరు, రాయలసీమ ప్రాంతాల్లో NIA దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ఘటనలపై ఆధారపడుతూ మరింత లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. కొందరు అక్రమ వలసదారులకు ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు లభించడమన్నది తీవ్రమైన అంశమని, వీటి ఆధారంగా వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
జాతీయ భద్రత, ప్రజల రక్షణను ముఖ్య అంశాలుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రాష్ట్రం పూర్తి సహకారం అందించేందుకు శాంతి భద్రతలతో పాటు అంతర్గత భద్రతపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: